న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) ఉపయోగించిన సాఫ్ట్వేర్(సోర్స్కోడ్)పై స్వతం త్ర ఆడిట్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యా న్ని (పిల్) సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈసీ రాజ్యాంగపరమైన ఆదేశాలను ఉల్లంఘిస్తున్నట్లు తెలిపే ఆధారాలను పిటిషనర్ సమర్పించలేదని తెలిపింది. ముఖ్యంగా ఈవీఎంలపై అనుమానా లు కలిగించే ఏ సమాచారాన్ని ఇవ్వలేదని పేర్కొన్నది. విధానపరమైన అంశాల జోలికి తాము వెళ్లబోమని స్పష్టంచేసింది. ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షక, నియంత్రణ అధికారాలను ఈసీకి రాజ్యాంగం ఇచ్చిందని కోర్టు తెలిపింది.