Forced conversions | బలవంతపు మతమార్పిడులు రాజ్యాంగ విరుద్ధం : పునరుద్ఘాటించిన సుప్రీంకోర్టు
Forced conversions | బలవంతపు మత మార్పిడులు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. మత మార్పిడులు తీవ్ర సమస్యగా కోర్టు అభిర్ణించింది. అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఈ పిటిషన్‌ను దాఖలు చేసి ప్రత్యేక చట్టం చేయాలని కోరారు.
Forced conversions | బలవంతపు మత మార్పిడులు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పుననుద్ఘాటించింది. మత మార్పిడులను తీవ్రమైన సమస్యగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. సోమవారం దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. పిల్ మెయింటెనెన్స్‌పై అభ్యంతరాలను తిరస్కరించింది. ‘ప్రతి స్వచ్ఛంద సంస్థ లేదా మంచి పనిని స్వాగతించాల్సిందే, కానీ ఉద్దేశాలను మాత్రం తనిఖీ చేయాల్సిందే..’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
మందులు, ఆహార ధాన్యాలు అందించి ఇతర మతాల్లోకి మారేలా ప్రజలను ప్రలోభపెట్టడం చాలా తీవ్రమైన సమస్య అని జస్టిస్ ఎంఆర్ షా అన్నారు. ‘ప్రత్యేకమైన వ్యక్తులకు సహాయం చేయాలని మీరు విశ్వసిస్తే వారికి సహాయం చేయండి. అంతే కానీ అది మత మార్పిడి కోసం ఉండకూడదు. ప్రలోభపెట్టడం చాలా ప్రమాదకరమైనది. ఇది చాలా తీవ్రమైన సమస్య. మన రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధం. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ భారతదేశ సంస్కృతికి అనుగుణంగా నడుచుకోవాలి..’ అని జస్టిస్ ఎంఆర్ షా అభిప్రాయం వ్యక్తం చేశారు.
న్యాయమూర్తులు ఎంఆర్ షా, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరై.. ఈ అంశంపై వివరణాత్మక సమాచారాన్ని అందించడానికి సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి బలవంతపు మత మార్పిడులకు సంబంధించిన డాటాను సేకరిస్తున్నట్లు ఆయన కోర్టుకు విన్నవించారు. ఇందు కోసం వారం గడువు కావాలని కోర్టును కోరారు. దాంతో తదుపరి విచారణను ఈ నెల 12 కు కోర్టు వాయిదా వేసింది.
బహుమతులు ఇవ్వడం, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం, బెదిరింపులకు దిగడం, మోసపూరితంగా ప్రలోభపెట్టడం ద్వారా జరిగే మత మార్పిడులను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మత మార్పిడులను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం చేయాలని, అలా కుదరనిపక్షంలో ఈ నేరాన్ని ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) లో చేర్చాలని పిటిషన్లో ఆయన కోర్టుకు విన్నవించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

