సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం వద్దు!
ఉత్తరప్రదేశ్లోని మూడు మందిర్-మసీదు వివాదాల విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తామన్న సుప్రీంకోర్టు ప్రతిపాదనను హిందూ, ముస్లిం పక్షాలు రెండూ తిరస్కరించాయి.
- న్యాయస్థానం ద్వారానే పరిష్కారం కావాలి
- కాశీ, మథుర, సంభల్ వివాదాలపై హిందూ, ముస్లిం పక్షాల వినతి
న్యూఢిల్లీ, జూలై 13: ఉత్తరప్రదేశ్లోని మూడు మందిర్-మసీదు వివాదాల విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తామన్న సుప్రీంకోర్టు ప్రతిపాదనను హిందూ, ముస్లిం పక్షాలు రెండూ తిరస్కరించాయి. వారణాసిలో జ్ఞానవాపి మసీదు, మథురలోని శ్రీకృష్ణజన్మభూమి షాహీ ఈద్గా, సంభల్లో షాహీ జామా మసీదు వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల విషయంలో శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు, ఉభయ పక్షాల అంగీకారాన్ని కోరుతూ.. సుప్రీంకోర్టు ‘సమాధాన్ సమారోహ్ 2026’ కార్యక్రమంలో భాగంగా మధ్యవర్తిత్వం వహిస్తామని ప్రతిపాదిస్తూ ఒక లేఖ పంపినట్టు బార్ అండ్ బెంచ్ వెల్లడించింది.
కాగా ఇందుకు ఉభయపక్షాలు అంగీకారం తెలుపలేదు. ఈ వివాదాలకు పరిష్కారం కోర్టు విచారణ ద్వారానే లభించాలని రెండు పక్షాలు స్పష్టం చేసినట్టు తెలిసింది. దీర్ఘకాల న్యాయవివాదాల పరిష్కారానికి సుప్రీంకోర్టు ఆగస్టు 21 నుంచి 23 వరకు సమాధాన్ సమారోహ్ కింద ప్రత్యేక లోక్అదాలత్ నిర్వహిస్తున్నది. ఈ సమయంలోనే మూడు వివాదాలకు పరిష్కారం కనుగొనాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించినట్టు బార్, బెంచ్ పేర్కొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

