న్యూఢిల్లీ : తమ డిమాండ్ల సాధనకు 25 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ ఆరోగ్యానికి పంజాబ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించిన సుప్రీం కోర్టు, ఆయనను తాత్కాలిక దవాఖానకు తరలించి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు హెచ్చరించిన క్రమంలో సుప్రీం ఈ హెచ్చరికలు జారీ చేసింది. దీక్షా స్థలి వద్ద ఉన్న దవాఖానకు దల్లేవాల్‌ను ఎందుకు తరలించ లేదని ధర్మాసనం ప్రశ్నించింది.