Supreme Court | పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలు.. నీట్-యూజీపై ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశం
నీట్-యూజీ పరీక్ష ఫలితాలను పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా ప్రకటించాలని జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది.
- ఈ నెల 20 లోగా ప్రకటించాలని గడువు
- విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్టు నిర్ధారణ అయితేనే రీటెస్ట్
- తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా
Supreme Court | న్యూఢిల్లీ, జూలై 18: నీట్-యూజీ పరీక్ష ఫలితాలను పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా ప్రకటించాలని జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఇందుకు గానూ జూలై 20 మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ఇచ్చింది. అయితే, అభ్యర్థుల గుర్తింపును మాత్రం గోప్యంగా ఉంచాలని సూచించింది. నీట్-యూజీలో అక్రమాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పూర్తిస్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని ఒక బలమైన నిర్ధారణకు వస్తేనే మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తామని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
పట్నా, హజారిబాగ్‌కు మాత్రమే ప్రశ్నాపత్రం లీకేజీ పరిమితం అయినట్టు ప్రాథమికంగా కనిపిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొన్నది. గోద్రాలో మాత్రం ఒక వ్యక్తి పలువురు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లలో సమాధానాలు రాసేందుకు డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయని తెలిపింది. నీట్-యూజీలో అక్రమాలపై విచారణ జరుపుతున్న సీబీఐ కోర్టుకు తెలిపిన వివరాలను బయటకు వెల్లడించలేమని, ఇలా చేస్తే విచారణపై ప్రభావం పడుతుందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై విచారణను జూలై 22కు కోర్టు వాయిదా వేసింది.
నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల అరెస్ట్
నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం పాట్నా, ఎయిమ్స్ ఎంబీబీఎస్ విద్యార్థులు నలుగురిని అరెస్ట్ చేసింది. వీరిలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న చందన్ సింగ్, రాహుల్ అనంత్, కుమార్ షాను, రెండో సంవత్సరం విద్యార్థి కరన్ జైన్ ఉన్నారు. వారుంటున్న హాస్టల్ రూమ్‌లను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. నీట్ పేపర్ లీక్‌కు సంబంధించి సీబీఐ ఇప్పటివరకు ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. కాగా హజారీబాగ్‌లో ఎన్టీఏ ట్రంక్ పెట్టె నుంచి పరీక్ష పేపర్ అపహరించిన పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య అనే సివిల్ ఇంజనీర్, పేపర్ అపహరణలో అతనికి సహకరించిన రాజు సింగ్ అనే వ్యక్తిని రెండు రోజుల క్రితమే సీబీఐ అరెస్ట్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

