న్యూఢిల్లీ: ఒకే ర్యాంక్ ఒకే పింఛన్(ఓఆర్ఓపీ) పథకం ఆధారంగా రిటైర్ట్ రెగ్యులర్ కెప్టెన్లకు చెల్లించాల్సిన పింఛన్లపై ఏండ్ల తరబడి ఎలాంటి నిర్ణయం తీసుకోని కేంద్రంపై సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.2 లక్షల జరిమానా విధించింది. సైనిక సంక్షేమ నిధులకు జమ చేయాలని ఆదేశించింది. నవంబర్ 14లోపు సమస్య పరిష్కరించకపోతే రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు 10% పింఛను పెంచాలని తామే ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. నవంబర్ 25కు తదుపరి విచారణను వాయిదా వేసింది.