Supreme Court | ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నోట్ల కట్టలు వెలుగు చూశాయన్న వార్తలు దేశవ్యాప్తంగా సర్వత్రా సంచలనం సృష్టించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. జస్టిస్ వర్మను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ నెల 21న సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆయనను బదిలీ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. అయితే, అంతకు ముందు జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది.
ఆయన బదిలీని సాధారణ విధానం ప్రకారమే బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయమూర్తి ఇంట్లో నోట్ల వివాదంతో బదిలీకి సంబంధం లేదని పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఢిల్లీ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మంటలను అదుపు చేస్తున్న సమయంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సగం కాలిపోయిన కరెన్సీ నోట్లను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఈ నెల 14న జరిగింది. ఢిల్లీలోని లుటియెన్స్ ప్రాంతంలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్ రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపక దళం.. పోలీసు సిబ్బంది నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు సీజేఐ సంజీవ్ కన్నా ముగ్గురు సభ్యులతో ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను జస్టిస్ వర్మ తీవ్రంగా ఖండించారు. తాను గానీ, కుటుంబీకులు గానీ ఎవరూ స్టోర్ రూమ్‌లో నగదును దాచిపెట్టేలదన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా అభివర్ణించారు. నగదు లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరుగుతాయని.. తాము సైతం యూపీఐ యాప్‌లను వాడుతామని.. కార్డులతోనూ లావాదేవీలు నిర్వహిస్తామన్నారు. ఉపయోగంలో లేని ఫర్నీచర్, సీసాలు, క్రాకరీ, పరుపులు, కార్పెట్లు, పాత స్పీకర్లు, గార్డెన్ వస్తువులను ఉంచేందుకు మాత్రమే స్టోర్ రూమ్‌ని వాడుతామన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జు తోసిపుచ్చారు. ఆయన కుటుంబం తనకు మూడు తరాలుగా తెలుసునన్నారు.
Supreme Court Collegium issues resolution recommending transfer of Justice Yashwant Varma, Judge of High Court of Delhi, back to his parent court, the Allahabad High Court
The Allahabad High Court Bar Association had raised objection over the Supreme Court Collegium’s decision… pic.twitter.com/x2Ro1mJS8U
— ANI (@ANI) March 24, 2025