న్యూఢిల్లీ, మార్చి 28: జగ్జిత్ సింగ్ డల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్షను విరమించటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి రాజకీయ ఎజెండా లేని, నిజమైన రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ డల్లేవాల్..అంటూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటిశ్వర్సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఖనౌరీ, శంభూ సరిహద్దులో రైతులు చేపట్టిన నిరాహార దీక్షకు ముగింపు పలికామని, నిరసనకారులను పంపించివే శామని పంజాబ్ ఏజీ కోర్టుకు తెలిపారు.