న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం(Coal scam)పై నమోదు అయిన కేసులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ కేసుల్ని విచారిస్తున్న ధర్మాసనం నుంచి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ కేవీ విశ్వనాథన్ తప్పుకున్నారు. ఓ కేసులో తాను లాయర్‌గా వాదించినట్లు ఆయన పేర్కొన్నారు. బొగ్గు స్కామ్‌పై కేసుల విచారణకు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కుమార్ కూడా ఉన్నారు.
ఫిబ్రవరి 10వ తేదీ నుంచి జరిగే విచారణల కోసం కొత్త త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. బొగ్గు కుంభకోణాలపై హైకోర్టుల్లో విచారణ చేపట్టరాదు అని గతంలో సుప్రీం పేర్కొన్నది.