న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో జడ్జిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ బేలా ఎం త్రివేది(Bela M Trivedi) ఇవాళ రిటైర్ అయ్యారు. సుప్రీంకోర్టులో ఆమె మూడున్నర ఏళ్ల పాటు జడ్జిగా విధులు నిర్వర్తించారు. సుప్రీంకోర్టులో జడ్జిగా చేసిన 11వ మహిళగా ఆమె కీర్తికెక్కారు. 1995 జూలైలో గుజరాత్‌లోని ట్రయల్ కోర్టు నుంచి ఆమె జర్నీ స్టార్ట్ అయ్యింది. సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక కీలక తీర్పుల్లో బేలా త్రివేది పాత్ర ఉన్నది.
బేలా త్రివేది జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన కోర్టులోనే.. ఆమె తండ్రి కూడా జడ్జిగా ఉన్నారు. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. లిమ్కా బుక్ ఆఫ్ ఇండియన్ రికార్డుల్లోకి కూడా ఆమె ఎక్కారు. 2021, ఆగస్టు 31వ తేదీన అత్యున్నత న్యాయస్థానం బేలా త్రివేదిని జడ్జిగా ప్రమోషన్ కల్పించారు. ఆ సమయంలో మొత్తం 9 మంది కొత్త జడ్జీలను ప్రకటించారు. ముగ్గురు మహిళల్లో ఈమె ఒకరు.
వెనుకబడిన తరగతుల వారికి 10 శాతం కోటా ఇవ్వాలని తీర్పు ఇచ్చిన అయిదుగురు సభ్యుల ధర్మాసనంలో బేలా త్రివేది ఉన్నారు. ఎస్పీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల ధర్మాసనంలోనూ ఆమె ఉన్నారు. ఎస్సీ జాబితాలో మార్పులు చేయంటే అది పార్లమెంట్ ద్వారే చేయాలని ఆమె ఓ 85 పేజీల నివేదిక తయారు చేసింది. పోక్సో చట్టానికి చెందిన ఓ కేసులో కీలక తీర్పు ఇచ్చారు. కామవాంఛతో మైనర్లను తాకితే అది లైంగిక దాడి అవుతుందని 2021లో తీర్పు ఇచ్చిన బెంచ్‌లో ఆమె ఉన్నారు.
గుజరాత్‌లోని పటాన్‌లో 1960, జూన్ 10వ తేదీన ఆమె జన్మించారు. గుజరాత్ హైకోర్టులో ఆమె పదేళ్ల పాటు లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. 1995, జూలై 1-వ తేదీన అహ్మదాబాద్‌లోని సెషన్స్ కోర్టులో జడ్జిగా నియమించారు. హైకోర్టులో రిజిస్ట్రార్ విలిలెన్స్, గుజరాత్ సర్కారులో న్యాయ కార్యదర్శిగా చేశారు.
ఇవాళ రిటైర్మెంట్ సందర్భంగా సుప్రీకోర్టు న్యాయవాదుల సంఘాలు ఎటువంటి ఫేర్వెల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు. దీని పట్ల విమర్శలు వస్తున్నాయి. సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాషి.. లాయర్ సంఘాలను తప్పుపట్టారు. సాధారణంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డు అసోసియేషన్ సంఘాలు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటాయి. అయితే జస్టిస్ బేలా త్రివేది రిటైర్మెంట్ గురించి మాత్రం ఆ సంఘాలు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు.