న్యూఢిల్లీ, జూలై 19: మేజర్ అయిన భార్యతో బలవంతంగా లైంగిక సంపర్కానికి పాల్పడిన భర్తది లైంగిక దాడి అవుతుందా? వైవాహిక రేప్ నేరం కాదా? భార్య అనుమతి లేకుండా ఆమెతో లైంగిక సంపర్కం చేస్తే అది తప్పు కాదా? ఈ ప్రశ్నలన్నింటిపై సుప్రీం కోర్టు సుదీర్ఘ విచారణ జరపనుంది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని,
ఈ కేసును అత్యవసరంగా విచారించాలని సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, పీఎస్ నరసింహ, మనోజ్ మిశ్రా ధర్మాసనం బుధవారం విచారించింది. రాజ్యాంగ బెంచ్ ముందున్న జాబితా చేసిన కేసు విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసును ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారిస్తుందని సీజేఐ తెలిపారు.