Waqf Act | వక్ఫ్ చట్టంపై పిటిషన్లు.. మధ్యంతర ఉత్తర్వులపై తీర్పును రిజర్వ్ చేసిన ‘సుప్రీం..!
Waqf Act | వక్ఫ్ (సవరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారించింది. పిటిషన్లతో పాటు కేంద్రం వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం మూడు కీలక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.
Waqf Act | వక్ఫ్ (సవరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారించింది. పిటిషన్లతో పాటు కేంద్రం వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం మూడు కీలక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ మను సింఘ్వీల వాదనలను సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం దాదాపు మూడు రోజుల పాటు వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వక్ఫ్ చట్టం లౌకికవాదంతో ముడిపడి ఉందని.. పార్లమెంట్ ఆమోదించిన ఏదైనా చట్టం రాజ్యాంగబద్ధంగా భావించబడుతున్నందున.. దాన్ని నిలిపివేయలేమంటూ కేంద్రం స్పష్టం చేసింది.
Read Also : “Supreme Court | ఈడీ అన్ని హద్దులూ మీరుతోంది.. దర్యాప్తు సంస్థపై సుప్రీంకోర్టు ఆగ్రహం”
పిటిషనర్ల తరఫున హాజరైన కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ రాజ్యాంగ సూత్రాలను విస్మరించారన్నారు. చట్టం న్యాయవ్యవస్థేతర ప్రక్రియ ద్వారా వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఓ మార్గమన్నారు. పిటిషనర్లు మూడు కీలక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వక్ఫ్ బై కోర్ట్స్, వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ బై డీడ్‌గా ప్రకించిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం ఈ మూడు అంశాలలో ఒకటి. రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కూర్పునకు సంబంధించినది రెండో అంశం. ఎక్స్ అఫిషియో సభ్యులు తప్ప మిగిలిన సభ్యులందరూ ముస్లింలే ఉండాలన్నది పిటిషనర్ల వాదన. ఇక మూడవది.. వక్ఫ్ ఆస్తా లేక ప్రభుత్వ ఆస్తా అన్న విషయాన్ని నిర్ధారించడానికి కలెక్టర్ విచారణ చేపట్టిన తర్వాత ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధనను పిటిషనర్లు వ్యతిరేకిస్తున్నారు.
Read Also : “Kaleshwaram | కాళేశ్వరం అద్భుతం.. ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం మాట”
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

