న్యూఢిల్లీ: ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం, 1991 చెట్లుబాటుపై కొత్త పిటిషన్లు దాఖలవుతుండటం పట్ల సుప్రీంకోర్టు సోమవారం అసహనం వ్యక్తం చేసింది.
పిటిషన్లు దాఖలు చేయడానికి ఓ పరిమితి ఉంటుందని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. సీనియర్ అడ్వకేట్ ఇందిర జైసింగ్ ఓ కక్షిదారు తరపున కొత్త పిటిషన్ను దాఖలు చేసినపుడు ఈ వ్యాఖ్యలు చేసింది.