Supreme Court | SIR లో పేరు తీసేస్తే రేషన్ ఇవ్వరా..? : సుప్రీంకోర్టు
Supreme Court | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నుంచి పేరు తొలగించబడిన వారికి రేషన్ నిరాకరిస్తూ పశ్చిమబెంగాల్ (West Bengal) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) లో బుధవారం విచారణ జరిగింది.
Supreme Court : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నుంచి పేరు తొలగించబడిన వారికి రేషన్ నిరాకరిస్తూ పశ్చిమబెంగాల్ (West Bengal) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) లో బుధవారం విచారణ జరిగింది. ఎస్ఐఆర్లో పేరు తీసేస్తే రేషన్ ఇవ్వరా అంటూ సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఇది రాష్ట్ర పరిధిలోని ప్రత్యేక కారణాలతో కూడిన అంశం కాబట్టి.. ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టుకు రాకుండా ముందుగా కోల్‌కతా హైకోర్టు (Kolkata High Court) ను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దాంతో పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్ ప్రసన్న తన పిటిషన్‌ను ఉపసంహరించుకుని హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి కోరారు. రేషన్ నిరాకరణ వివాదంపై కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛనిస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీలతో కూడిన వెకేషన్ బెంచ్ ఆదేశాలు జారీచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

