Supreme Court | కలిసి బిడ్డను కని.. ఇప్పుడు రేప్ అంటే ఎలా.. సహజీవనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court | పరస్పర అంగీకారంతో కూడిన సహ జీవన సంబంధాలు విచ్ఛిన్నమైన తర్వాత వాటిని నేరంగా పరిగణించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది. ఇటువంటి ఏర్పాట్లు సహజంగానే ఇద్దరు భాగస్వాములకు అనిశ్చితి, చట్టపరమైన నష్టాలను తెస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది.
Supreme Court | న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: పరస్పర అంగీకారంతో కూడిన సహ జీవన సంబంధాలు విచ్ఛిన్నమైన తర్వాత వాటిని నేరంగా పరిగణించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది. ఇటువంటి ఏర్పాట్లు సహజంగానే ఇద్దరు భాగస్వాములకు అనిశ్చితి, చట్టపరమైన నష్టాలను తెస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. పెండ్లి చేసుకుంటానని బూటకపు వాగ్దానం చేసి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఒక మహిళ చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న సహజీవన సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భాగస్వాములలో ఎవరైనా ఎప్పుడైనా విడిపోవడానికి స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు.
‘సంవత్సరాల తరబడి వారు కలిసి జీవించారు. ఒకవేళ వారు విడిపోతే ఆ మహిళ పురుషుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేయాల్సి వస్తుంది’ అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. ఆ వ్యక్తికి ఇప్పటికే వివాహమైందని, అతను ఆమెను మోసం చేసి వేధించాడని మహిళ తరఫు న్యాయవాది వాదించగా ‘పరస్పర అంగీకారంతో సంబంధం ఏర్పడినపుడు ఇక నేరం అన్న ప్రశ్న ఎక్కడ వస్తుంది? వారిద్దరూ కలిసి జీవిస్తున్నారు.
అతని ద్వారా ఒక బిడ్డను కూడా ఆమె కనింది. పెండ్లి చేసుకోలేదు కాని ఆమె తనపై లైంగిక దాడి జరిగిందని అంటున్నది’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వివాహం చేసుకుని ఉంటే మహిళకు న్యాయపరమైన హక్కులు చాలా బలంగా ఉండేవని న్యాయమూర్తి చెప్పారు. ‘రెండో పెండ్లి విషయంలో ఆమె కోర్టును ఆశ్రయించి ఉండవచ్చు’ అని కోర్టు స్పష్టం చేసింది. అయితే బిడ్డ కోసం ఆమె మనోవర్తిని కోరడానికి అవకాశం ఉందని కోర్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

