న్యూఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసులో బెయిల్ మీద ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి(Gali Janardhan Reddy)కి ఇవాళ సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అతను బల్లారి వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. జనార్ధన్ రెడ్డి కూతురు ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ శిశువును చూసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. బల్లారి జిల్లాలోనే నవంబర్ 6వ తేదీ వరకు ఉండేందుకు కూడా కోర్టు ఓకే చెప్పింది.ఇక మైనింగ్ కేసులో నవంబర్ 9వ తేదీలోగా విచారణ పూర్తి చేయాలని కూడా జస్టిస్ ఎంఆర్ షా, కృష్ణ మురారితో కూడిన ధర్మాసనం ప్రత్యేక కోర్టును ఆదేశించింది. 2015 నుంచి బెయిల్పై ఉన్న జనార్ధన్ రెడ్డి.. కర్నాటకలోని బల్లారి, ఏపీలోని అనంతపురం, కడప వెళ్లకూడదన్న నిషేధం ఉంది. మనవరాలు పుట్టిన నేపథ్యంలో జనార్ధన్ రెడ్డి బల్లారి వెళ్లేందుకు సుప్రీంను ఆశ్రయించారు.