చండీగఢ్: శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) అధ్యక్ష పదవికి సుఖ్బీర్ సింగ్ బాదల్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ వర్కింగ్ కమిటీకి సమర్పించారు. ఆ పార్టీ సీనియర్ నేత దల్జిత్ సింగ్ చీమ వివరాలను వెల్లడించారు. బాదల్ మతపరమైన అపరాధాలు చేసినట్లు అకల్ తఖ్త్ జతేదార్ రెండు నెలల క్రితం తెలిపారు.
ఎస్ఏడీ, ఆ పార్టీ ప్రభుత్వం 2007-2017 మధ్య ఈ అపరాధాలు చేసినట్లు వివరించారు. తన నేరానికి శిక్ష విధించాలని ఆయన కోరినప్పటికీ అకల్ తఖ్త్ జతేదార్ స్పందించలేదు.