చండీఘఢ్: శిరోమణి అకాలీ దళ్ పార్టీ అధ్యక్ష పదవికి సుఖ్బీర్ సింగ్ బాదల్(Sukhbir Singh Badal) రాజీనామా చేశారు. ఆ పార్టీ ప్రతినిధి డాక్టర్ దల్జీత్ సింగ్ చీమా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇటీవల సిక్కు మత పెద్దలు సుఖ్బీర్ను టంకయ్యగా డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఆయనకు శిక్ష పడాల్సి ఉన్నది. సిక్కు మత సూత్రాలను ఉల్లంఘించిన వారిని టంకయ్యగా పేర్కొంటారు. ఆ కేసులో దోషిగా తేలిస్తే, ఆ మత ఆచారం ప్రకారం శిక్ష వేస్తారు.
ఇటీవల సుఖ్బీర్ కుడి పాదానికి ఇటీవల సర్జరీ కూడా జరిగింది. పార్టీ వర్కింగ్ కమిటీకి సుఖ్బీర్ సింగ్ రాజీనామాను సమర్పించినట్లు దల్జీత్ సింగ్ తెలిపారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎన్నికకు రూటు క్లియర్ అయినట్లు ఆయన చెప్పారు. తన నాయకత్వంపై నమ్మకం ఉంచిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు సుఖ్బీర్ థ్యాంక్స్ చెప్పినట్లు తన ఎక్స్ అకౌంట్లో దల్జీత్ వెల్లడించారు.
The SAD President S Sukhbir Singh Badal submitted his resignation to the working Committee of the party today to pave the way for the election of new President. He thanked all the party leaders & workers for expressing confidence in his leadership and extending wholehearted…
— Dr Daljit S Cheema (@drcheemasad) November 16, 2024