Evening Exercise | న్యూఢిల్లీ : సాయంత్ర వేళల్లో వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఒబేసిటీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అధిక బరువు, ఊబకాయంతో బాధపడే పెద్దలు సాయంత్రం పూట మధ్యస్థ స్థాయి నుంచి అధిక స్థాయిలో శారీరక శ్రమ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయని అధ్యయనం వెల్లడించింది.
స్పెయిన్లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రెనడా పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. 186 మందిపై అధ్యయ నం చేయగా, ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి అర్ధర్రాతి వరకు 14 రోజులపాటు 46 ఏండ్ల సగటు వయస్సు, అధిక బరువు ఉన్న వారితో వ్యాయామాలు చేయించినట్టు పేర్కొన్నారు. సాయంత్రం వేళల్లో శారీరక శ్రమ చేసిన వారి బ్లడ్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.