న్యూఢిల్లీ : ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ అనుమానాస్పద మరణంపై పోరాడుతున్న అతడి తల్లి తాజాగా ఆ రోజు తన కుమారుడు నివసిస్తున్న శాన్ఫ్రాన్సిస్కోలోని అపార్ట్మెంట్ ఫొటోను షేర్ చేసింది. అపార్ట్మెంట్ భవనంలో సర్వేలెన్స్ కెమెరాలో రికార్డయిన ఫుటేజ్ ప్రకారం ఆ రోజు బాలాజీ తన డిన్నర్గా భావిస్తున్న బ్రౌన్ కలర్ బ్యాగ్‌తో లిఫ్ట్ పక్కన నిలబడి ఉన్నాడు. ఓపెన్ ఏఐ అనుసరిస్తున్న నైతిక ప్రమాణాలను ప్రశ్నించాడని, ప్రజావేగు (విజిల్ బ్లోయర్)గా మారాడని బాలాజీ తల్లి చెప్పారు. తన కుమారుడి హత్యపై ఎఫ్‌బీఐ విచారణ జరపాలని మరోమారు డిమాండ్ చేశారు.