న్యూఢిల్లీ: బీహార్‌లో రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ గొడవలో ఓ విద్యార్థిని(Student Shot Dead) కాల్చివేశారు. దీంతో టెన్త్ చదువుతున్న విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. రోహతాస్ జిల్లాలో మెట్రిక్యులేషన్ పరీక్ష రాస్తున్న విద్యార్థుల మధ్య బుధవారం గొడవ జరిగింది. పరీక్ష హాల్లో కాపీ కొట్టినట్లు రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం జరిగింది. స్టూడెంట్ గ్యాంగ్‌లు కొట్టుకున్నాయి. ఆ తర్వాత గురువారం కూడా మరోసారి ఘర్షణ జరిగింది. ఆ సమయంలో ఓ విద్యార్థిని కాల్చివేశారు.
ఆ కాల్పుల్లో మరో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. ఓ విద్యార్థి కాలికి, మరో విద్యార్థి వెన్నుకు బుల్లెట్ గాయాలయ్యాయి. విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. విద్యార్థి మృతి పట్ల కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.