Mamata Banerjee | కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మహిళల భద్రతను దీదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee)కి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా ఓ విద్యార్థి చేసిన పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదంగా (Controversial Post) మారింది.
బీకాం చదువుతున్న కీర్తిశర్మ అనే విద్యార్థి మమతా బెనర్జీకి హత్య బెదిరింపులు చేశాడు. ‘మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కాల్చి చంపినట్లే మమతా బెనర్జీపైనా కాల్పులు జరపాలి..(Shoot Mamata Banerjee like Indira Gandhi)’ అంటూ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టాడు. దీంతోపాటు హత్యాచారానికి గురైన వైద్యురాలి ఫొటోలను కూడా పోస్టు చేశాడు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. హత్యను, అల్లర్లను ప్రేరేపించడం, అత్యాచార బాధితురాలి వివరాలను బయటపెట్టడం తదితర నేరాల కింద కేసులు బుక్ చేసి అరెస్ట్ చేసినట్లు కోల్‌కతా పోలీసులు తెలిపారు.
Also Read..
Imran Khan | ఆక్స్ఫర్డ్ వర్సిటీ చాన్సలర్ పదవికి నామినేషన్ వేసిన ఇమ్రాన్ ఖాన్
PM Modi | ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ.. స్పష్టతనిచ్చిన విదేశాంగ శాఖ
Chhattisgarh | బొమ్మ కోసం గొడవపడుతున్న ఇద్దరు పిల్లల్ని చితకబాదిన తండ్రి.. ఎనిమిదేళ్ల బాలిక మృతి