Imran Khan | బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం చాన్సలర్ పదవికి (Oxford chancellor polls) పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన నామినేషన్ వేశారు (nomination submitted). ఈ విషయాన్ని ఇమ్రాన్ సహాయకుడు సయీద్ జుల్ఫీ బుఖారీతో పాటు పాక్ పత్రిక డాన్ ధ్రువీకరించింది.
వర్సిటీకి చాన్సలర్‌గా దాదాపు 21 ఏళ్ల పాటు సేవలందించిన 80 ఏళ్ల లార్డ్ ప్యాటెన్ పదవీ విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. 2003 నుంచి ఆయన ఈ వర్సిటీకి చాన్సలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ ప్రకటించారు. 2023 – 24 విద్యా సంవత్సరం చివరిలో పదవీ విరమణ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ పదవి ఖాళీ అయింది.
ఇక చాన్సలర్ పదవి కోసం శతాబ్దాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు, ఉద్యోగులు ఈ పదవికి పోటీ చేయడానికి అర్హులు. తాజాగా ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి మార్పులు చేశారు. నామినేషన్, ఓటింగ్ అన్ లైన్ లో జరిగే వెసులుబాటు కల్పించారు. ఈ ఎన్నికలు అక్టోబర్‌లో జరగనున్నాయి. తదుపరి చాన్సలర్ పదేళ్లపాటు పదవిలో ఉండనున్నారు.
కాగా, ఇమ్రాన్ ఖాన్ 1972లో ఆక్స్‌ఫర్డ్‌లోని కెబ్లె కళాశాలలో ఆర్థిక, రాజనీతి శాస్ర్తాలను చదివారు. ఆయన 2005-2014 మధ్య కాలంలో బ్రాడ్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా పని చేశారు. ఈ చాన్స్‌లర్ పదవికి పోటీలో బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్ కూడా ఉన్నారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని ఆడియా జైల్లో ఉన్న విషయం తెలిసిందే. తోషఖానా, సైఫర్, ముస్లిం వ్యతిరేక వివాహం తదితర కేసుల్లో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన భార్య బుర్షా బీబీ కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ పై 200కి పైగా కేసులు నమోదు చేశారు.
Also Read..
PM Modi | ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ.. స్పష్టతనిచ్చిన విదేశాంగ శాఖ
Chhattisgarh | బొమ్మ కోసం గొడవపడుతున్న ఇద్దరు పిల్లల్ని చితకబాదిన తండ్రి.. ఎనిమిదేళ్ల బాలిక మృతి
Raksha Bandhan | చిన్నారులతో రాఖీ వేడుకలను జరుపుకున్న ప్రధాని మోదీ.. VIDEO