ఆదివారం 07 జూన్ 2020
National - Apr 03, 2020 , 16:39:27

వైద్య, ఆరోగ్య సిబ్బందిపై దాడిచేస్తే కఠిన చర్యలు

వైద్య, ఆరోగ్య సిబ్బందిపై దాడిచేస్తే కఠిన చర్యలు

హైదరాబాద్‌: డాక్టర్లు, ఆరోగ్యకార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులపై దాడి కేసుల్లో కఠినంగా వ్యవహరించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ర్టాలకు లేఖరాసింది. కరోనా కేసులను గుర్తించడంలో, రక్త నమూనాలను సేకరించేటప్పుడు, హాస్పిటళ్లలో వైద్య సిబ్బందిపై జరుగుతుండటంతో వారి రక్షణకు భరోసా కల్పించాలని హోం మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి పున్యా సలిల శ్రీవాత్సవ పేర్కొన్నారు. అదేవిధంగా కరోనాకు సంబంధించి మరో రెండు హెల్ప్‌లైన్‌ నంబర్లు1930, 1944 విడుదల చేశారు. కరోనాకు సంబంధించి సందేహాలు, సమస్యలు ఉన్నా ఈ టోల్‌ఫీ నంబర్లలో సంప్రథించాలని తెలిపింది.  1930 దేశవ్యాప్తంగా టోల్‌ఫ్రీ నంబర్‌ అని, 1944ను మాత్రం ఈశాన్య రాష్ర్టాలకు కేటాయించామని పేర్కొన్నారు. 


logo