Street Dog | చెన్నై : తమిళనాడులోని మధురైలో ఓ వీధి కుక్క స్వైరవిహారం చేసింది. తండ్రీకొడుకులపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మొత్తానికి ఈ వీధికుక్కను మధురై కార్పొరేషన్ ఏనిమల్ కంట్రోల్ టీమ్ బంధించింది.
వివరాల్లోకి వెళ్తే.. మధురైలోని ఓ ఇంటి ఆవరణలోకి వీధి కుక్క ప్రవేశించింది. బాత్రూమ్లో స్నానం చేసి బయటకు వచ్చిన బాలుడిపై వీధి కుక్క అటాక్ చేసింది. కాళ్లు, చేతులు, తొడలపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తన కుమారుడిని వీధి కుక్క నుంచి కాపాడుకునేందుకు యత్నించగా, తండ్రిపై కూడా దాడి చేసింది. దీంతో అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఒక నిమిషం 38 సెకండ్ల పాటు కుక్క స్వైర విహారం చేసింది. కుక్క దాడిలో గాయపడ్డ తండ్రి ముత్తుస్వామి, కుమారుడు సెంథిల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక తండ్రీకొడుకులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వీధి కుక్కను మధురై కార్పొరేషన్ ఏనిమల్ కంట్రోల్ టీమ్ తీవ్రంగా శ్రమించి పట్టుకున్నారు. వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరించారు.
#Madurai: Stray Dog Attacks 8-Years-Old Outside Home, Father Also Mauled While Rescuing Him. pic.twitter.com/4mxuZfOb4N
— Deepak Singh (@SinghDeepakUP) August 8, 2025