న్యూఢిల్లీ: మానవ నైపుణ్యాన్ని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే ఒక వినూత్న యత్నానికి ఓ స్టార్టప్ అంకురార్పణ చేసింది. రియల్ టైమ్‌లో పారిశ్రామిక రంగానికి చెందిన నిపుణులను యూజర్లకు అనుసంధానం చేసే టాప్‌మేట్.
ఏఓ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు కెరీర్ గైడెన్స్, సందేహాలకు సమాధానాలు, తమ లక్ష్యాలను సాధించాలనుకునే వ్యక్తులకు సాయం అందచేయగల నిపుణులను నేరుగా 10 నిమిషాల్లో సంప్రదించే అవకాశాన్ని కల్పిస్తున్నది. ఆయా రంగాలలో నిష్ణాతులైన నిపుణులు తక్షణమే అందుబాటులో ఉంటారని ఆ కంపెనీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వెబ్సైట్ లింక్‌ను షేర్ చేసింది.