నలంద: బీహార్‌లోని నలంద జిల్లాలో ఇవాళ తొక్కిసలాట జరిగింది. మాఘ్రా గ్రామంలో ఉన్న షీతలాష్టమి ఆలయం(Mata Shitalashtami Temple)లో ఈ ఘటన జరిగింది. తొక్కిసలాటలో సుమారు 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయివారిలో అందరూ మహిళలే ఉన్నారు. మరో డజను మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. నలంద జిల్లాలోని బీహార్ షరీఫ్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో.. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. తొక్కిసలాట తర్వాత ఆలయం వద్ద భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అనేక మంది మహిళలు స్పృహ తప్పి పడిపోయి ఉన్న దృశ్యాలు కనిపించాయి.
మృతిచెందిన భక్తుల్లో ఇద్దర్ని గుర్తించారు. గాయపడ్డవారిని చికిత్స కోసం స్థానికంగా ఉన్న మోడల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చైత్రమాసంలోని కృష్ణపక్షం 8వ రోజు అష్టమి కావడంతో.. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి తరలివచ్చారు. షీతలాష్టమి రోజున స్థానికలు తమ ఇండ్లల్లో పొయ్యిలు వెలిగించరు. ముందు రోజు వండిన వంటను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక అష్టమి రోజున ఈ ఆలయంలో భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అమ్మవారి దర్శనం కోసం భారీ క్యూలైన్లు ఉంటాయి.
#WATCH | Bihar: A stampede occurred during puja at Maa Sheetla Mandir in Maghra village of Nalanda. Injuries reported, deaths feared. More details awaited.
Visuals from the spot as an ambulance reaches here. pic.twitter.com/1UU0kwN6OA
— ANI (@ANI) March 31, 2026