Mohana Singh | జోధ్‌పూర్: భారత ఏవియేషన్ చరిత్రలో స్కాడ్రన్ లీడర్ మోహనాసింగ్ తన పేరును చిరస్థాయిగా లిఖించుకున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఫైటర్ జెట్ స్కాడ్రన్ నిర్వహించే ఎలైట్ 18 ‘ఫ్లయింగ్ బులెట్స్’ స్కాడ్రన్‌లో తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా రికార్డులకెక్కారు. భారత వైమానిక దళంలోని ముగ్గురు మహిళా పైలట్లలో స్కాడ్రన్ లీడర్ మోహనాసింగ్ ఒకరు. మిగతా ఇద్దరిలో ఒకరు స్కాడ్రన్ లీడర్ భావనాకాంత్ కాగా, మరొకరు స్కాడ్రన్ లీడర్ అవనీ చతుర్వేది. ఇటీవలి వరకు ఆమె సుఖోయ్ ఎస్యు-30 ఎంకేఐ పైటర్ జెట్స్ నడిపారు. ఆ తర్వాత ఆమె గుజరాత్ సెక్టార్‌లోని నలియా ఎయిర్‌బేస్‌లో మోహరించిన ఎల్సీఏ స్కాడ్రన్‌కు బదిలీ అయ్యారు. 2016లో ప్రభుత్వం మహిళల కోసం ఫైటర్ స్ట్రీమ్‌ను ప్రారంభించిన తర్వాత ఐఏఎఫ్‌లో దాదాపు 20 మంది మహిళా ఫైటర్ పైలట్లు ఉన్నారు.
భారత్‌లో అనూహ్యమైన వాతావరణ మార్పులపై అమెరికా సైంటిస్టులు, నిపుణులు కీలక విషయాన్ని వెల్లడించారు. 1970 తర్వాత భారత్‌లో ఈ ఏడాది జూన్-ఆగస్టు త్రైమాసికంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, రెండో అత్యంత వేడి త్రైమాసికంగా నిలిచిందని ‘ైక్లెమేట్ సెంట్రల్’ నివేదిక తెలిపింది. జనాభాలో మూడోవంతు మంది ఏడు రోజులు ప్రమాదకరమైన వేడిని భరించారని పేర్కొన్నది