జైపూర్ : రాజస్ధాన్‌లో బీజేపీ ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టనుండటంతో సీఎం రేసులో అళ్వార్ ఎంపీ, ఆథ్యాత్మిక వేత్త మహంత్ బాలక్‌నాథ్ (Mahant Balaknath) పేరు వినిపిస్తోంది. తిజర నియోజకవర్గం నుంచి బాలక్‌నాథ్ తన కాంగ్రెస్ ప్రత్యర్ధిపై భారీ ఆధిక్యం కనబరుస్తున్నారు. రాజస్ధాన్‌లో బీజేపీ ఈసారి 120కిపైగా స్ధానాలను గెలుచుకుంటుందని 40 ఏండ్ల అళ్వార్ ఎంపీ బాలక్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు.
ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపునకు ముందు బాలక్‌నాథ్ శివాలయానికి వెళ్లి పూజలు చేశారు. 199 అసెంబ్లీ స్ధానాలున్న రాజస్ధాన్‌లో బీజేపీ ప్రస్తుతం 112 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ కేవలం 71 స్ధానాలకు పరిమితమైంది.
రాజస్ధాన్‌లో గెహ్లాట్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్ధాన్ సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని, తాను ఎంపీ పదవి పట్ల సంతృప్తిగానే ఉన్నానని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని అన్నారు.
Read More :
Assembly Election | మూడు రాష్ట్రాల్లో కమలం హవా.. సంబరాల్లో బీజేపీ శ్రేణులు