ఆమ్స్టర్డామ్: ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 550 మంది పిల్లలకు తండ్రయ్యాడో వ్యక్తి. అంతమందిని ఎలా కన్నాడండీ బాబు! అని ఆశ్చర్యపోకండి. దొరికినవాళ్లకల్లా తన వీర్యాన్ని దానం చేస్తూ పోయాడు. డచ్ చట్టాల ప్రకారం 12 మందికే వీర్యం దానం చేయొచ్చు. 25 మంది పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉన్నది. కానీ, అంతకుమించి వీర్యాన్ని దానం చేశాడు. కోర్టు అతడిపై నిషేధం విధించింది. ‘తన వీర్య కణాలు దానంగా స్వీకరించాలని డోనర్ ఉద్దేశపూర్వకంగా తల్లిదండ్రుల్ని ప్రభావితం చేస్తున్నాడు. తల్లిదండ్రుల, పిల్లల గోప్యత హక్కును ఉల్లంఘించటమే ఇది’ అంటూ ద హేగ్ జిల్లా కోర్టు వ్యాఖ్యానించింది.