న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం(Car Accident) జరిగింది. ఓ కారు అతి వేగంగా దూసుకొచ్చి.. డివైడర్‌ను ఢీకొట్టి.. ఆ తర్వాత పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అయిదుగురు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్రిటికల్‌గా గాయపడిన వారిని సరోజిని నాయుడు మెడికల్ కాలేజీలో చేర్చినట్లు ఎసీపీ శేషమణి ఉపాధ్యాయ తెలిపారు. ఆగ్రాలోని నాగ్లా బుది వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మృతిచెందినవారిని బబ్లీ, భాను ప్రతాప్, కమల్, కృష్ణ, బంటేశ్గా గుర్తించారు. భాను ప్రతాప్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో పార్సిల్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.
హై స్పీడ్‌తో కారు దూసుకువచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తొలుత డివైడర్‌ను ఢీకొన్న తర్వాత అదే వేగంతో సమీపంలో ఉన్న జనంపై దూసుకెళ్లింది. మొత్తం ఏడుమందిని కారు ఢీకొట్టింది. రాహుల్, గోలు అనే వ్యక్తులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. వాహనాన్ని సీజ్ చేశారు. మద్యం మత్తులో డ్రైవర్ కారు నడుపుతున్నాడా లేదా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు.