న్యూఢిల్లీ: ఇద్దరు విద్యార్థులు ఫుట్‌పాత్‌పై నడుస్తున్నారు. ఇంతలో ఒక కారు వేగంగా వారి మీదకు దూసుకెళ్లింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Speeding Car Knocks Down Students) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. కాలేజీ విద్యార్థులైన యువతి, యువకుడు గురువారం పటేల్ నగర్‌లోని ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్నారు. వేగంగా వచ్చిన కారు ఫుట్‌పాత్‌పై నడుస్తున్న విద్యార్థుల మీదకు దూసుకెళ్లింది. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు.
కాగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే యువకుడు మరణించగా యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
फूटपाथ पर चलना भी सुरक्षित नहीं. देखिए कैसे
दिल्ली के पटेल नगर में दर्दनाक हादसा हुआ.फूटपाथ पर जा चढ़ी एक गाड़ी, जिसकी चपेट में दो युवक आ गये. इस हादसे में एक युवक की मौके पर मौत हो गई, जबकि दूसरे की हालत गंभीर बताई जा रही है. pic.twitter.com/x7aUrC4zMc
— Priya singh (@priyarajputlive) February 15, 2024