న్యూఢిల్లీ: వచ్చే నెల 1 నుంచి పలు ప్రభుత్వ సేవల్లో కొత్త మార్పులు అమలు కానున్నాయి. అవేంటో చూద్దాం..
ఆర్బీఐ చెక్ క్లియరింగ్: అక్టోబర్ 4 నుంచి బ్యాంకు చెక్కుల క్లియరింగ్‌లో నిరంతరాయ క్లియరింగ్ పద్ధతిని ఆర్బీఐ అమలు చేయనుంది. చెక్కుల క్లియరెన్స్ ప్రక్రియ అదే రోజు గంటల వ్యవధిలో క్రెడిట్ టు క్రెడిట్ జరగనుంది.
ఆన్లైన్లో రైల్వే జనరల్ టికెట్లు: ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా జనరల్ టికెట్లను రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఆధార్ ధ్రువీకరణ పొందిన యూజర్లు ఈ విధానంలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
స్పీడ్ పోస్ట్ ధరల పెంపు, ఓటీపీ సేవలు: సవరించిన ధరల కారణంగా స్పీడ్ పోస్ట్ (Speed Post) ధరలు పెరగనున్నాయి. ఓటీపీ ఆధారిత బట్వాడాను వినియోగదారులు ఎంచుకోవచ్చు. ఓటీపీని ధ్రువీకరించుకున్నాకే వస్తువులను అందజేస్తారు.
కీపింగ్ చార్జీల సవరణ: భవిష్య నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ కేంద్ర రికార్డుల నిర్వహణ ఏజెన్సీలు అందించే ఎన్పీఎస్, ఎన్పీఎస్ లైట్, ఎన్పీఎస్ వాత్సల్య, యూపీఎస్, అటల్ పెన్షన్ యోజన వంటి పింఛను పథకాల సేవల చార్జీలను సవరించనుంది. సబ్‌స్ర్కైబర్ల ఖాతాలను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో నిర్వహించడానికి వీటిని వసూలు చేస్తారు.
ఎన్పీఎస్ ఈక్విటీ ఎంపిక: ప్రభుత్వేతర జాతీయ పింఛన్ పథకం(NPS) చందాదారులు కేవలం ఒక ఎన్పీఎస్ ప్లాన్‌లో మాత్రమే 100 శాతం తమ డబ్బును పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తారు.