న్యూఢిల్లీ: ఇటీవలే భారత్లో స్ట్రీట్ వ్యూ సేవలు ప్రారంభించిన గూగుల్.. కొన్ని నగరాల్లోని రోడ్లపై వేగం పరిమితిని (స్పీడ్ లిమిట్) కూడా సూచించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. బెంగళూరు, చండీగఢ్ నగరాల్లో తొలుత ఈ సేవలు అందించనున్నది. స్థానిక ట్రాఫిక్ పోలీసులతో భాగస్వామ్యమై మరిన్ని నగరాలకూ ఈ సేవలు విస్తరించేందుకు గూగుల్ చర్యలు తీసుకుంటున్నది. వచ్చే నెలలో హైదరాబాద్, కోల్కతాలో కూడా ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని గూగుల్ యోచిస్తున్నది.