బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం మార్పుపై మళ్లీ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కొత్తగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రిగా నియమిస్తారంటూ కొత్త ప్రచారం మొదలైంది.
అయితే దీనిని ఖర్గే గురువారం ఖండిస్తూ ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రిని మార్చే ఉద్దేశం అధిష్ఠానానికి లేదని, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ముందు చేసుకున్న అధికార భాగస్వామ్య ఒప్పందం ప్రకారం డీకేను ముఖ్యమంత్రిగా చేయాలంటూ ఆయన అనుచరులు అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.