న్యూఢిల్లీ: జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి టికెట్లు బుక్ చేసుకోండి. భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం జ్యోతిర్లింగాల స్పెషల్ రైలును నడుపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైలు ఈ నెల 17న జార్ఖండ్‌లోని ధన్బాద్లో ప్రారంభమవుతుంది. మొత్తం 13 రోజుల (12 రాత్రులు)పాటు కొనసాగే ఈ యాత్రలో ప్రయాణికులకు ఆహారం, వసతి తదితర ఏర్పాట్లను ఐఆర్‌సీటీసీనే చూసుకుంటుంది. టికెట్ ధరను రూ.12,285గా నిర్ణయించగా.. వసతి, ఆహారం తదితర ఖర్చులు కూడా ఇందులోకి వస్తాయి.