Vizag Steel Plant | న్యూఢిల్లీ: ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త అందజేసింది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్)కు ఆర్థికంగా భారీ సాయం అందించాలని నిర్ణయించింది. గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిసింది.
ఈ ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్‌ను నడిపేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన విధివిధానాలను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి శుక్రవారం వెల్లడించే అవకాశాలున్నాయి.