AIADMK | ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఉండదు.. కీలక ప్రకటన చేసిన తమిళనాడు స్పీకర్
AIADMK | అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామికి ఎదురు దెబ్బ తగిలింది.
తమిళనాడు : అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామికి ఎదురు దెబ్బ తగిలింది. విప్ ఆదేశాలను ఉల్లంఘించి టీవీకే (TVK) ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేసిన 21 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ తిరస్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..మొదట 25 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ పళనిస్వామి ఒక పిటిషన్ సమర్పించారని తెలిపారు.
ఈ అంశంపై పళనిస్వామి నాలుగు వేర్వేరు లేఖలు పంపారని, ఆ 21 మంది ఎమ్మెల్యేలను క్షమించాలని కోరుతూ పళనిస్వామి అసెంబ్లీకి లేఖ రాశారని, దీనినే పరిగణలోకి తీసకున్నామని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం స్వయంగా వారిని మన్నించాలని కోరినందున, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆ 21 మందిపై ఎలాంటి అనర్హత చర్యలు ఉండవని స్పీకర్ స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకునే ముందు రాజ్యాంగపరమైన అంశాలను, అసెంబ్లీ నిబంధనల ప్రకారం వాటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఓటింగ్ సమయంలో ఇదే గ్రూపులో ఉన్న మరో నలుగురు ఎమ్మెల్యేలు (పెరుందురై జయకుమార్, మరకథం కుమారవేల్, ఇసక్కి సుబ్బయ్య, సత్యభామ) అంతకుముందే తమ పదవులకు రాజీనామా చేసి టీవీకే పార్టీలో చేరారని వారిపై కేసులు పరిశీలనలో ఉన్నాయని, విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ప్రకటన చేస్తా మని స్పీకర్ పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయంతో ఏఐడీఎంకేలో రాజకీయ ముసలం అలముకున్నన్న ట్లయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొద్దిమందిపై మాత్రమే క్రమశిక్షణ చర్యలను పరిమితం చేస్తూ మెజారిటీ ఎమ్మె ల్యేలను క్షమించాలన్న పార్టీ నాయకత్వ నిర్ణయంపై పట్ల ఆ పార్టీలో కొంత మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

