Home
National
Spain President Pedro Sanchez Tested Positive For Covid 19 He Is Not Attending G20 Meet
Spain President :స్పెయిన్ అధ్యక్షుడికి కోవిడ్ పాజిటివ్.. జీ20 సమావేశాలకు దూరం
Spain President : స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచేజ్‌కు కరోనా వైరస్ సోకింది. కోవిడ్ పరీక్షలో ఆయన పాజిటివ్‌గా తేలారు. దీంతో ఆయన జీ20 సమావేశాలకు హాజరుకావడంలేదు. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు హాజరవుతున్నారు.
న్యూఢిల్లీ: స్పెయిన్ అధ్యక్షుడు(Spain President) పెడ్రో సాంచేజ్‌కు కరోనా వైరస్ సంక్రమించింది. కోవిడ్ పరీక్షలో ఆయన పాజిటివ్‌గా తేలారు.దీంతో ఢిల్లీలో జరగనున్న జీ20 సమావేశాలకు ఆయన హాజరుకావడం లేదు. ఆ దేశం తరపున ఉపాధ్యక్షుడు నదియా కాల్వినో సాంటమారియా, విదేశాంగ మంత్రి జోస్ మాన్యువల్ అల్బేర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, కానీ జీ20 మీటింగ్‌కు వెళ్లడం లేదని ఆయన అన్నారు. ఈ సమావేశాల నుంచి దూరంగా ఉన్న వారి జాబితాలో పుతిన్, జిన్‌పింగ్, సాంచేజ్ ఉన్నారు. సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ20 సమావేశాలను నిర్వహిస్తున్నారు. సుమారు 30 దేశాలకు చెందిన అధినేతలు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

