న్యూఢిల్లీ, మే 7: అంతరిక్ష ఆధారిత నిఘా సామర్థ్యాల్ని పెంచుకునేందుకు భారత్.. రోదసిలో 52 నిఘా శాటిలైట్ల సమూహాన్ని వచ్చే ఐదేండ్లలో ఏర్పాటుచేయబోతున్నట్టు ‘ఇన్-స్పేస్’ చైర్మెన్ పవన్‌కుమార్ గోయెంకా ప్రకటించారు. సగం ఉపగ్రహాలను ప్రైవేట్ రంగం నుంచి తీసుకుంటామని, మిగతావి ఇస్రో నుంచి వస్తాయని ఆయన ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.