Akhilesh yadav | లక్నో : టమాటాల ధర కొండెక్కి కేజీ వంద రూపాయలు దాటడంపై సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు వారణాసిలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అఖిలేష్ యాదవ్ 50వ పుట్టిన రోజు సందర్భంగా శనివారం టమాట ఆకారంలోని కేక్‌ను కట్ చేసి స్థానికులకు పావుకిలో వంతున టమాటాలను పంచిపెట్టారు. అమేథి జిల్లాలో ఒక పొలంలో వరి నారుతో ‘హ్యాపీ బర్త్ డే అఖిలేష్ జీ’ అని రాసి శుభాకాంక్షలు తెలిపారు. అఖిలేష్ జన్మదినాన్ని లోక్ కల్యాణ్ దివస్‌గా జరిపారు. ప్రతిసారీ అఖిలేష్ జన్మదినాన్ని వైభవంగా నిర్వహించే వారమని, ఈసారి టమాటాల ధర 120 రూపాయలు దాటిందని, తమ నోటి దగ్గర కూడు లాక్కున్నారని ఎస్పీ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.