గురువారం 28 మే 2020
National - May 11, 2020 , 09:34:55

మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరిన ములాయం సింగ్ యాద‌వ్‌

మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరిన ములాయం సింగ్ యాద‌వ్‌

ల‌క్నో: స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్ మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరారు. క‌డుపు నొప్పి ఎక్కువ కావ‌డంతో ఆయ‌న‌ను ఆస్ప‌త్రిలో చేర్పించారు. గ‌త ఐదు రోజుల్లో ఆయ‌న ఆస్ప‌త్రిలో చేర‌డం ఇది రెండోసారి. అంత‌కు ముందు ఆయ‌నను బుధ‌వారం ఆస్ప‌త్రిలో చేర్పించారు. చికిత్స అనంత‌రం శ‌నివారం డిశ్చార్జ్ చేశారు. వారి పెద్ద ప్రేగుల‌లో వాపు ఉంది. కాని ఆరోగ్యంగానే ఉన్నారు. కొలొనోస్కోపీ చేశామ‌ని ఆయ‌న‌కు చికిత్స అందించిన వేదాంత ఆసుప‌త్రి డైరెక్ట‌ర్‌ గ్యాస్ట్రో స‌ర్జ‌న్ డాక్ట‌ర్‌రాకేశ్ క‌పూర్ తెలిపారు. ప్ర‌గ‌తిశీల స‌మాజ్‌వాదీ పార్టీ చీప్ శివ‌పాల్‌సింగ్ యాద‌వ్ మాట్లాడుతూ...  ములాయం సింగ్ యాద‌వ్ ఆరోగ్య బాగుంద‌ని, ఆయ‌న దీర్ఘాయువు కోసం ప్ర‌జ‌లు ప్రార్ధించాల‌ని కోరారు. ‌


logo