లక్నో: ఎప్పుడూ వివాదాల్లో ఉండే సమాజ్వాది పార్టీ సీనియర్ నాయకుడు, రాంపూర్ ఎమ్మెల్యే అజాంఖాన్ శాసనసభ్యత్వంపై వేటుపడింది. ఓ కేసులో మూడేండ్ల జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ మేరకు యూపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ఒక ప్రకటన చేసింది.
అజాంఖాన్ 2019లో ఒక సభలో మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టేవిధంగా విద్వేషపూరిత ప్రసంగం చేశారు. దాంతో అతనిపై కేసు నమోదయ్యింది. గురువారం ఈ కేసులో తీర్పు వెల్లడించిన జిల్లా సెషన్స్ కోర్టు ఆయనకు మూడేండ్ల జైలుశిక్ష, రూ.2000 జరిమానా విధించింది. కాగా, అజాంఖాన్ ఇటీవల కూడా ఓ చీటింగ్ కేసులో అరెస్టై బెయిల్పై బయటికి వచ్చాడు.