హైదరాబాద్, జనవరి 27: వచ్చే నెల ఐదు రాష్ర్టాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీ వైపునకు మొగ్గు చూపుతారన్న అంశంపై హైదరాబాద్కు చెందిన ఆత్మసాక్షి గ్రూప్ మూడ్ ఆఫ్ ఓటర్స్ సర్వే నిర్వహించింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాలో ఈ సర్వే జరిపింది. జనవరి 24 నాటికి నిర్వహించిన ప్రీ-పోల్ సర్వేను బట్టి యూపీలో అఖిలేశ్ నేతృత్వంలోని ఎస్పీ ముందంజలో ఉన్నట్టు సర్వే అభిప్రాయపడింది. మొత్తం 403 సీట్లలో ఎస్పీకి 221-228 స్థానాలు, బీజేపీకి 133-138 సీట్లు, బీఎస్పీకి 17-21, కాంగ్రెస్కు 16-20 స్థానాలు లభించవచ్చని అంచనా వేసింది. ముస్లిం, ఓబీసీ ఓటర్లు ఎస్పీ వెనుకే ఉన్నట్టు, బ్రాహ్మణులు, దళితవర్గాల ఓట్లు బీజేపీ, ఎస్పీకి పడనున్నట్టు పేర్కొంది.