NDA Meet : నూతనంగా ఎన్నికైన ఎంపీలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే శుక్రవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలు హాజరు కానున్నారు. కూటమి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 సీట్లకే పరిమితం కావడంతో జేడీయూ, టీడీపీ సహా భాగస్వామ్య పార్టీల తోడ్పాటు అనివార్యమైంది. కాగా ఎన్డీయే పార్టీలు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని తమ నేతగా ఎన్నుకున్నాయి. ఎన్డీయే ఎంపీల సమావేశంలో నూతన ఎంపీలు తమ నేతగా మోదీని ఎన్నుకుంటూ తీర్మానం చేయడంతో పాటు తీర్మాన ప్రతిని సంకీర్ణ నేతలు రాష్ట్రపతికి అందించనున్నారు.
ఇక జూన్ 9న నరేంద్ర మోదీ మూడవసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎన్డీయే వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఎన్డీయే కూటమిలో కీలకంగా మారిన టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు రేపు తమ పార్టీ ఎంపీలతో కలిసి ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు.
Read More :