న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి ఆంగ్ల పరీక్షలో మహిళలను కించపర్చేలా ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇవ్వడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ( Sonia Gandhi ) ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై నరేంద్రమోదీ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సోమవారం లోక్సభ జీరో అవర్లో సోనియా ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం వెంటనే ఆ ప్రశ్నను ఉపసంహరించుకోవాలని, ఈ ఘోర తప్పిదంపై సమీక్ష చేయించాలని సోనియాగాంధీ డిమాండ్ వినిపించారు.
కాగా, గత శనివారం CBSE 10వ తరగతి ఆంగ్ల పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో ఇచ్చిన ఓ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో మహిళలను కించపర్చే వాక్యాలు ఉన్నాయి. మహిళలకు స్వేచ్ఛనిస్తే చిన్నారులపై తల్లిదండ్రులు ఆదిపత్యం కోల్పోతారు అనేది అందులో ఒక వాక్యం. భర్త మార్గంలో నడుచుకోవడం ద్వారానే తల్లి వయోజనులైన పిల్లల విధేయతను పొందగలదు అని మరో వాక్యం ఉన్నది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని లోక్సభలో సోనియా పట్టుబట్టారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో కాంగ్రెస్, డీఎంకే, ఐయూఎంఎల్, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
#WATCH | Congress interim chief Sonia Gandhi raises in Lok Sabha the issue of inclusion of a 'shockingly regressive passage' in CBSE's question paper for Grade 10 exam, demands withdrawal of the passage & apology
— ANI (@ANI) December 13, 2021
(Source: Sansad TV) pic.twitter.com/lO1Db4ty3q