సోనాలీ ఫోగట్ హత్య కేసు | మరో ఇద్దరు నిందితుల అరెస్ట్.. కఠిన శిక్ష తప్పదన్న గోవా సీఎం
పనాజీ: బీజేపీ మహిళా నాయకురాలు, టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫోగట్ హత్య కేసులో దోషులకు కఠిన శిక్ష తప్పదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. ఘటన జరిగిన నాటి నుంచి కేసు దర్యాప్తులో తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నదని ఆయన తెలిపారు. ఈ కేసులో దోషులను గోవా పోలీసులు నూటికి నూరుపాళ్లు శిక్షించి తీరుతారని పేర్కొన్నారు.
ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని, కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని ప్రమోద్ సావంత్ వెల్లడించారు. ఇటీవల గోవాలోని అంజునా బీచ్‌లోగల ఓ క్లబ్లో పార్టీకి హాజరైన సోనాలీ ఫోగట్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే మరణానికి ముందు ఆమెతో ఆమె సహచరుడు సుధీర్సంగ్వాన్ బలవంతంగా ఏదో మత్తుపదార్థం కల్పిన పానీయం తాగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అందుకే అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోనాలీ సహచరులైన సుధీర్ సంగ్వాన్‌తోపాటు సుఖ్విందర్ సింగ్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
తాజాగా అరెస్టయిన వారిలో పార్టీ జరిగిన క్లబ్ ఓనర్, డ్రగ్స్ సరఫరా చేసిన డీలర్ దత్ప్రసాద్ గోంకర్ ఉన్నారు. తాజా అరెస్టులతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

