Solar Eclipse-Lunar Eclipse | ఈ ఏడాదిలో నాలుగు గ్రహణాలు కనువిందు చేయనున్నాయి. సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడాన్ని సూర్యగ్రహణం అని పిలుస్తుంటారు. ఈ ఏడాదిలో నాలుగు గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. ఇందులో రెండు చంద్రగ్రహణాలు, రెండు సూర్యగ్రహణాలు ఉన్నాయి. మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20, 2023 గురువారం రోజున ఏర్పడనున్నది.
ఈ గ్రహణం ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 వరకు ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. రెండో గ్రహణం అక్టోబర్ 14న ఏర్పడబోతున్నది. భారత్తో పాటు పశ్చిమాఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటికా, అంటార్కిటికా ప్రాంతాల్లో ఈ గ్రహణం కనువిందు చేయనున్నది. ఇక తొలి చంద్రగ్రహణం శుక్రవారం మే 5 న ఏర్పడనున్నది. రాత్రి 8.45 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1 గంటలకు ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. రెండో గ్రహణం అక్టోబర్ 29న కనిపించనున్నది. మధ్యాహ్నం 1.06 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 2:22 గంటలకు ముగుస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం భారత్లో కనిపించదు.