మనం ఇతరుల మాట వినటం లేదు
సమాజంలో ఇతరుల మాట వినే పరిణితి ప్రతి ఒక్కరిలో ఉండాలని సీజేఐ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. జీవితం ప్రతి దశలోనూ ఇతరుల మాట వినటం చాలా ముఖ్యమన్నారు.
- సోషల్ మీడియా వల్ల అసహనం పెరుగుతున్నది: సీజేఐ
ముంబై: సమాజంలో ఇతరుల మాట వినే పరిణితి ప్రతి ఒక్కరిలో ఉండాలని సీజేఐ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. జీవితం ప్రతి దశలోనూ ఇతరుల మాట వినటం చాలా ముఖ్యమన్నారు. శనివారం ముంబైలో జరిగిన సింబయాసిస్ (డీమ్డ్) వర్సిటీ 20వ స్నాతకోత్సవంలో పాల్గొన్న సీజేఐ మాట్లాడుతూ ‘మనం ఇతరుల మాట వినటం లేదు.
మనం మన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. జీవన ప్రయాణంలో మానవత్వం, ధైర్యాన్ని సహచరులుగా మార్చుకోవాలి’ అని అన్నారు. సమాజంలో నేడు చాలామంది సంపన్న జీవితం కోసం ప్రయత్నిస్తున్నారని, ఇందులో తప్పేమీ లేదని, అయితే ఇది విలువలు, సూత్రాల విషయంలో రాజీపడకుండా ఉండాలన్నారు.
శుక్రవారం ఓ అవార్డు కార్యక్రమంలో సీజేఐ మాట్లాడుతూ కుడి, ఎడమవాదులు, మధ్యేవాదుల ‘పోలరైజేషన్’ ప్రపంచవ్యాప్తంగా కనపడుతున్నదని, భారత్ ఇందుకు భిన్నమేమీ కాదని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వల్ల వివిధ వర్గాల మధ్య అసహనం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

