న్యూఢిల్లీ: స్నేహ దూబే. 2012 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఇండియా ప్రతినిధిగా ఆమె మాట్లాడారు. ఫస్ట్ సెక్రటరీగా స్నేహ దూబే.. పాకిస్థాన్ వైఖరిని యూఎన్ సాక్షిగా ఏకిపారేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కూడా తనదైన స్టయిల్లో కౌంటర్ ఇస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. యూఎన్‌లో ఇండియా తరపున ఫస్ట్ సెక్రటరీగా ఉన్న స్నేహ దూబే.. గోవాలో స్కూల్ విద్యను పూర్తి చేశారు. పుణెలోని ఫెర్గూసన్ కాలేజీ నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు. ఇక ఢిల్లీలోని జవర్లాల్ నెహ్రూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి ఎంఫిల్ పూర్తి చేసిందామె.
12 ఏళ్ల వయసులోనూ ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌లో ఉద్యోగం చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నది. 2011లో సివిల్ సర్వీసెస్ రాసిన మొదటి ప్రయత్నంలోనే ఆమె పాసైంది. అంతర్జాతీయ వ్యవహారాల గురించి నేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఫారిన్ సర్వీసెస్‌పై దృష్టి పెట్టినట్లు ఆమె చెప్పారు. కొత్త సంస్కృతులను తెలుసుకోవాలన్న థ్రిల్, కీలకమైన విధాన నిర్ణయాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న తపన తనలో ఉన్నట్లు స్నేహ దూబే గతంలో తెలిపారు.
స్నేహకు ట్రావెలింగ్ అన్నా ఇష్టమే. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కావడం వల్ల తాను దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కినట్లు ఆమె చెప్పారు. తమ కుటుంబం నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన మొదటి వ్యక్తి స్నేహ దూబే. తండ్రి ఓ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇక తల్లి స్కూల్ టీచర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఫారిన్ సర్వీస్‌కు ఎంపికైన తర్వాత.. విదేశీ వ్యవహారాల శాఖలో తొలిసారి ఆమె అపాయింట్ అయ్యింది. 2014లో మాడ్రిడ్‌లో ఉన్న ఎంబసీలో ఆమె తొలి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం యూఎన్‌లో ఇండియా ఫస్ట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు.
యూఎన్‌లో స్నేహ దూబే మాట్లాడిన తీరు పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె మాట్లాడిన వీడియోలను పోస్టు చేస్తూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. పాకిస్థాన్ వైఖరిని స్నేహ ఎండగట్టిన తీరు అద్భుతమన్నారు. పదునెక్కిన పదాలతో పొరుగు దేశాన్ని చీల్చిచెండాడిన తీరు సూపర్ అన్నారు. ప్రతి మాటను చాలా జాగ్రత్తగా ఆమె ఎన్నుకున్నట్లు నెటిజెన్స్ అభిప్రాయపడ్డారు. నిజాలను నిర్భయంగా చెప్పిందన్నారు. గతంలోనూ యూఎన్‌లో ఇండియా తరపున మహిళా ప్రతినిధులు ఇలాగే మాట్లాడారు. ఈనమ్ గంభీర్, విదిషా మైత్రా తరహాలోనే స్నేహ కూడా పాక్ భరతం పట్టిందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
#SnehaDubey tears apart Imran Khan in the UN assembly. What an insult for Pakistan at global forum! 🔥
— Mukesh Jain (@M0002004) September 25, 2021
Take a bow lady 👏 pic.twitter.com/AtDZKmCzXB
Eenam Gambhir, Vidisha Maitra, Sneha Dubey.
— Ranvijay Kapoor (@kapoor_ranvijay) September 25, 2021
Fiery Rights of Reply by India’s brilliant female diplomats to Pakistani leaders’ rants @UN. pic.twitter.com/4JQF2HR0MI
Quad #AskModiOnFarmersProtest Godse POTUS Watch: Young Indian Diplomat. This small girl from India Sneha Dubey hit #PMImranKhanAtUNGA for a massive SIX straight over his bald head pic.twitter.com/Qwrrnxihvd
— Subs (@Subs69907712) September 25, 2021